హైదరాబాద్, ఆట ప్రతినిధి: డెహ్రాడూన్ వేదికగా జరిగిన ఏషియన్ ఓపెన్ ట్రాక్ స్పీడ్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ యువ స్కేటర్ ఆర్ణవ్రెడ్డి కాంస్య పతకంతో మెరిశాడు. బాలుర 333మీటర్ల రేసులో బరిలోకి దిగిన ఆర్ణవ్.. ప్రత్యర్థులకు దీటైన పోటీనిస్తూ మూడో స్థానంలో నిలిచాడు. ఆసియాలో టాప్ స్కేటర్లను ఎదుర్కొంటూ టాప్-3 దక్కించుకున్నాడు.
స్కేటింగ్‌లో నిలకడగా రాణిస్తున్న ఆర్ణవ్ ప్రస్తుతం కోచ్‌లు ఖాదిర్, సయ్యద్ ఏషాన్, సయ్యద్ సఫీ దగ్గర శిక్షణ తీసుకుంటున్నాడు. చిన్న వయసులోనే స్కేటింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్న ఆర్ణవ్ భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలన్న ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నాడు.