Manu Bhakar | పారిస్: ఒలింపిక్స్ ముగింపు వేడుకలకు యువ షూటర్ మను భాకర్ భారత పతాకధారిగా వ్యవహరించనుంది. ఈ మేరకు భారత ఒలింపిక్ సంఘం(ఐవోఏ) ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. పారిస్‌లో భారత్‌కు కాంస్య పతకంతో బోణీ కొట్టిన మను.. రెండ్రోజుల వ్యవధిలోనే సహచర షూటర్ సరభ్‌జ్యోత్ సింగ్‌తో కలిసి రెండో పతకం సాధించింది. తద్వారా ఒకే ఎడిషన్‌లో రెండు పతకాలు సాధించిన మొదటి షూటర్‌గా రికార్డులకెక్కింది. ముగింపు వేడుకలలో పురుష పతాకధారి పేరును త్వరలో ప్రకటించనున్నారు.