Vaibhav Suryavanshi : ఐపీఎల్లో మెరుపు సెంచరీతో వార్తల్లో నిలిచిన వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) మళ్లీ చెలరేగిపోయాడు. అండర్ -19 విభాగంలో రెచ్చిపోయి ఆడుతున్న ఈ యంగ్‌స్టర్ అసియాకప్ రైజింగ్ స్టార్స్ (Asia Cup Rising Stars) టోర్నీలో ఊచకోతకు తెగబడ్డాడు. ఓపెనర్‌గా వచ్చిన వైభవ్ యూఏఈ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ 32 బంతుల్లోనే శతకగర్జన చేశాడు. ఆకాశమే హద్దుగా దంచేసిన ఈ లెఫ్ట్ హ్యాండర్ 10 ఫోర్లు, 9 సిక్సర్లతో మూడంకెల స్కోర్ అందుకున్నాడు.
జూనియర్ క్రికెట్లో సంచలనంగా పేరొందిన వైభవ్ సూర్యవంశీ మరో రికార్డు బద్ధలు కొట్టాడు. ఏసీసీ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో వీరబాదుడుతో యూఏపీపై శతకం సాధించాడు. పురుషుల టీ20ల్లో భారత్ తరఫున మూడో వేగవంతమైన శతకం నమోదు చేశాడు. దొరికిన బంతినల్లా బౌండరీకి పంపిన ఈ చిచ్చరపిడుగు.. వెస్టిండీస్ వెటరన్ క్రిస్ గేల్ అత్యధిక స్కోర్‌ను అధిగమించేలా కనిపించాడు. కానీ, వైభవ్ 144 వద్ద ఔట్ కావడంతో గిల్ రికార్డు అలానే ఉండిపోయింది.
Vaibhav Sooryavanshi is a superstar. Period. 🔥
📹 | A statement century from our Boss Baby to set the tone 🤩
Watch #INDvUAE in the #DPWorldAsiaCupRisingStars2025, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork #SonyLIV pic.twitter.com/K0RIoK4Fyv
— Sony Sports Network (@SonySportsNetwk) November 14, 2025
ఐపీఎల్ 18వ సీజన్ నుంచి వైభవ్ పేరు గట్టిగా వినిపిస్తోంది. ఓపెనర్‌గా అదరకబెదరక సిక్సర్ల వాన కురిపించే అతడు క్రీజులో ఉన్నాడంటే బౌలర్లు జడుస్తున్నారు. పన్నెండేళ్లకే రంజీల్లో అరంగేట్రం చేసిన వైభవ్‌ను ఆ ఎడిషన్ మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) సొంతం చేసుకుంది. రూ.1.5 కోట్లకు రాజస్థాన్ శిబిరంలో చేరిన ఈ కుర్రాడు తన బ్యాటింగ్‌ను సానబెట్టుకున్నాడు. కెప్టెన్ సంజూ శాంసన్ గాయపడడంతో లక్నోతో మ్యాచ్‌లో వైభవ్‌కు ఓపెనర్‌గా అవకాశం వచ్చింది. తొలి మ్యాచ్‌లోనే 35 పరుగులతో ఆకట్టుకున్న ఈ చిచ్చరపిడుగు.. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్‌పై సెంచరీతో గర్జించాడు.
𝐌𝐀𝐊𝐈𝐍𝐆. 𝐀. 𝐒𝐓𝐀𝐓𝐄𝐌𝐄𝐍𝐓 🫡
Welcome to #TATAIPL, Vaibhav Suryavanshi 🤝
Updates ▶️ https://t.co/02MS6ICvQl#RRvLSG | @rajasthanroyals pic.twitter.com/MizhfSax4q
— IndianPremierLeague (@IPL) April 19, 2025
సిరాజ్, రషీద్ ఖాన్ వంటి మేటి బౌలర్లను అలవోకగా ఆడేసిన వైభవ్ .. ఐపీఎల్ హిస్టరీలోనే రెండో వేగవంతమైన శతకం నమోదు చేశాడు. బౌలర్ మారినా బంతి గమ్యం స్టాండ్స్‌లోకే అన్నట్టు చెలరేగిన వైభవ్.. 35 బంతుల్లోనే వందతో జైపూర్ ప్రేక్షకులకు సెల్యూట్ చేశాడు. అతడి విధ్వంసక ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 11 సిక్సర్లు ఉండడం విశేషం. ఐపీఎల్ స్టార్‌గా భారత అండర్-19 జట్టులోకి వచ్చిన వైభవ్ ఇంగ్లండ్ పర్యటనలో.. ఆపై ఆస్ట్రేలియా గడ్డపై చితక్కొట్టాడు. ఆసీస్‌తో జరిగిన యూత్ వన్డేలో మెరుపు హాఫ్ సెంచరీ బాదిన వైభవ్.. అత్యధిక సిక్సర్లతో మరో ఫీట్ సాధించాడు. మాజీ టీమిండియా ప్లేయర్ ఉన్ముక్త్ చంద్ (Unmukt Chand) పేరిట ఉన్న రికార్డును తన పేరిట రాసుకున్నాడీ చిచ్చరపిడుగు.