హైదరాబాద్, ఆట ప్రతినిధి : లేక్ లిప్నో(చెక్ రిపబ్లిక్)లో జరిగిన ప్రపంచ సెయిలింగ్ చాంపియన్షిప్లో హైదరాబాద్ యువ సెయిలర్లు వినోద్ దండు, బద్రీనాథ్ సత్తాచాటారు. ఏడు యూరోపియన్ దేశాలు, ఆస్ట్రేలియా, భారత్ నుంచి వచ్చిన 104 బోట్లతో కూడిన అంతర్జాతీయ బృందాలను వినోద్, బద్రీనాథ్ అండర్-17 క్యాడెట్ క్లాస్లో ఆశ్చర్యపరిచారు.
మొత్తం 12 రేసుల్లో రెండు సింగిల్ డిజిట్ స్థానాలను, ఒక రేసులో రెండో స్థానాన్ని సాధించి, ఓవరాల్గా 14వ స్థానంలో నిలిచారు. సికింద్రాబాద్ ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఈ యువకులు యాచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్నారు. కోచ్ సుహేమ్ షేక్ శిక్షణలో రెండు నెలల వ్యవధిలోనే ప్రపంచ టోర్నీకి అర్హత సాధించడం విశేషం.