హైదరాబాద్, ఆట ప్రతినిధి: బాలీ(ఇండోనేషియా) వేదికగా జరుగుతున్న వరల్డ్ టూర్ ఐటీఎఫ్ టెన్నిస్ టోర్నీలో రాష్ట్ర యువ ప్లేయర్ సాయికార్తీక్రెడ్డి సత్తాచాటాడు. మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో కార్తీక్‌రెడ్డి, బొబ్రోవ్ బోగ్డాన్(రష్యా) ద్వయం 7-6(7-1), 6-1 తేడాతో సంజీవ్, వాన్ డాస్లర్(నెదర్లాండ్స్) జోడీపై గెలిచి ముందంజ వేసింది. మరోవైపు సింగిల్స్ తొలి రౌండ్లో కార్తీక్‌రెడ్డి 5-7, 3-6తో జెనియర్ టాంగ్వె(స్విట్జర్లాండ్) చేతిలో ఓటమిపాలయ్యాడు.