Saurabh Sharma | నోట్విల్: స్విట్జర్లాండ్‌లోని నోట్విల్ వేదికగా జరుగుతున్న వరల్డ్ పారా అథ్లెట్ గ్రాండ్ ప్రిలో భారత యువ పారా అథ్లెట్ సౌరభ్ శర్మ రెండు స్వర్ణాలతో సత్తా చాటాడు. టీ12 విభాగం (దృష్టి లోపం)లో 155 మీటర్లు, 5000 మీటర్ల రేసులలో పసిడి పరుగులు తీశాడు. హిమాచల్‌ప్రదేశ్‌లోని హమిర్పూర్ జిల్లా రొప ఖయ గ్రామానికి చెందిన సౌరభ్ ప్రస్తుతం డెహ్రాడూన్‌లోని నేషనల్ దృష్టి దివ్యాంగన్ ఎంపవర్మెంట్ ఇనిస్టిట్యూట్‌లో విద్యాభ్యాసం చేస్తున్నాడు.