అహ్మదాబాద్: భారత యువ వెయిట్‌లిఫ్టర్ కోయల్ బార్ కొత్త చరిత్ర లిఖించింది. కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో కోయల్ రెండు యూత్ ప్రపంచ రికార్డులను తన పేరిట లిఖించుకుంది. మంగళవారం జరిగిన మహిళల 53కిలోల యూత్, జూనియర్ విభాగాల్లో బరిలోకి దిగిన కోయల్ అద్భుత ప్రదర్శన కనబరిచింది.
తొలుత యూత్ విభాగంలో కోయల్ స్నాచ్‌లో 85కిలోలతో నయా రికార్డు ఖాతాలో వేసుకుంది. అదే దూకుడు కొనసాగిస్తూ క్లీన్ అండ్ జెర్క్‌లో తొలుత 105కిలోలు ఎత్తిన ఈ అమ్మాయి అదనంగా మరో రెండు కిలోలతో మొత్తంగా 192కిలోలతో పసిడి పతకం కైవసం చేసుకుంది.
ఈక్రమంలో ఇప్పటి వరకు ఉన్న రికార్డు(188కి)ను కోయల్ తిరుగరాసింది. మరోవైపు పురుషుల 65కిలోల విభాగంలో రాజా ముతుపాండి(128కి+168కి)..మొత్తంగా 296కిలోలతో తృటిలో స్వర్ణం చేజార్చుకున్నాడు.