ఆయుష్ సంచలనం
బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్‌షిప్‌లో భారత యువ షట్లర్ ఆయూష్ శెట్టి సంచలనం సృష్టించాడు. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఆయూష్ అద్భుత విజయాలతో ప్రత్యర్థులను చిత్తుచేస్తున్నాడు.
- వరల్డ్ నంబర్‌వన్‌పై అద్భుత విజయం
- ఆసియా చాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు
నింగ్బో(చైనా): బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్‌షిప్‌లో భారత యువ షట్లర్ ఆయూష్ శెట్టి సంచలనం సృష్టించాడు. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఆయూష్ అద్భుత విజయాలతో ప్రత్యర్థులను చిత్తుచేస్తున్నాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ఆయూష్ 10-21, 21-19, 21-17తో టాప్‌సీడ్, ప్రపంచ చాంపియన్ కున్లావత్ వితిద్సర్న్పై చిరస్మరణీయ విజయం సాధించాడు. టోర్నీ ఆసాంతం తనదైన దూకుడు కనబరుస్తున్న ఆయూష్ సెమీస్‌లో అదే ఒరవడి కొనసాగించాడు. తద్వారా 60 ఏండ్ల తర్వాత ఫైనల్‌కు అర్హత సాధించిన తొలి భారత షట్లర్‌గా శెట్టి నిలిచాడు. 1965లో పురుషుల సింగిల్స్‌లో స్వర్ణం గెలిచిన ఏకైక భారత ప్లేయర్‌గా దినేశ్ ఖన్నా నెలకొల్పిన రికార్డును ఇప్పటికీ ఎవరూ తుడిచిపెట్టలేకపోయారు. మ్యాచ్ విషయానికొస్తే 75 నిమిషాల పాటు సాగిన పోరులో తొలి గేమ్ కోల్పోయిన ఆయూష్..రెండో గేమ్ నుంచి పుంజుకుని పోటీలోకి వచ్చాడు. తొలి గేమ్ తప్పిదాలను పునరావృతం చేయకుండా ముందుకు సాగిన శెట్టి చిరస్మరణీయ విజయంతో చరిత్రకు అడుగు దూరంలో నిలిచాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

