గువాహటి: గువాహటి మాస్టర్స్ సూపర్-100 బ్యాడ్మింటన్ టెర్నీలో భారత యువ షట్లర్ అన్మోల్ ఖర్బ్ సంచలనం సృష్టించింది. టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ లలిన్రాత్ చైవాన్కు దిమ్మతిరిగే షాక్ ఇస్తూ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో అన్మోల్ 21-13, 22-24, 22-20తో లలిన్రాత్(థాయ్‌లాండ్)పై విజయం సాధించింది. మరో పోరులో మాన్సిసింగ్ 20-22, 18-21తో యటవీన్ కాటెక్లెంగ్ (థాయ్‌లాండ్) చేతిలో ఓటమిపాలైంది.
మరోవైపు పురుషుల సింగిల్స్‌లో మూడో సీడ్ సతీశ్‌కుమార్ 21-19, 21-13తో సరన్ జంప్రి(థాయ్‌లాండ్)పై గెలిచి సెమీస్‌లోకి వెళ్లాడు. మిక్స్డ్ డబుల్స్‌లో ఐదోసీడ్ ద్రువ్ కపిల-తనీషా క్యాస్ట్రో 21-16, 21-14తో సాత్విక్‌రెడ్డి-వైష్ణవి జోడీపై గెలిచింది. మహిళల డబుల్స్‌లో టాప్‌సీడ్ జోడీ అశ్విని పొనప్ప, తనీశ 21-18, 21-13తో ఐదోసీడ్ హువాంగ్ కెజిన్, టాంగ్ రుయిజిపై గెలిచి సెమీస్‌లోకి ప్రవేశించారు.