బ్యూనస్ ఎయిర్స్ (అర్జెంటీనా): ప్రతిష్టాత్మక ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్లో భారత యువ షూటర్ రుద్రాంక్ష్ పాటిల్ పసిడి గెలిచాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో రుద్రాంక్ష్.. 252.9 పాయింట్లు స్కోరు చేసి స్వర్ణం సాధించాడు. ఈ టోర్నీలో భారత్కు ఇది రెండో స్వర్ణం.