టోక్యో : భారత యువ షూటర్ ప్రాంజలి ప్రశాంత్ ధుమాల్ టోక్యోలో జరుగుతున్న డెఫ్లింపిక్స్లో మూడో పతకం గెలిచింది. ఇప్పటికే స్వర్ణం, రజతం గెలిచిన ఆమె.. సోమవారం జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లోనూ పసిడి గురిపెట్టింది. ఈ టోర్నీలో భారత షూటర్లకు ఇది 16వ పతకం కావడం విశేషం.
ఇక రెజ్లింగ్లో ఫైనల్ చేరిన సుమిత్ దహియా (పురుషుల 97 కిలోల ఫ్రీస్టయిల్) 6-0తో ఒమెర్ సేనర్ (టర్కీ)పై గెలిచి స్వర్ణం సాధించాడు. 86 కిలోల క్యాటగిరీలో అమిత్ కృష్ణన్.. 1-11తో ఉక్రెయిన్ రెజ్లర్ చెర్వోనెంకొ చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకున్నాడు.