లిమా (పెరు): భారత యువ షూటర్ అర్జున్ బబుతా ఐఎస్ఎస్ఎఫ్ షూటిం ప్రపంచకప్లో రజతంతో మెరిశాడు. పది మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో భాగంగా హోరాహోరీగా జరిగిన ఫైనల్లో అర్జున్.. 252.3 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచాడు.
స్వర్ణం గెలిచిన చైనా షూటర్ షెంగ్ లిహావో (252.4)తో కేవలం 0.1 పాయింట్ల తేడాతో అర్జున్ పసిడి కోల్పోవాల్సి వచ్చింది.