న్యూఢిల్లీ: భారత యువ పారా అథ్లెట్ సిమ్రాన్శర్మ చిక్కుల్లో పడింది. ఇటీవల ముగిసిన ప్రతిష్టాత్మక ప్రపంచ పారా అథ్లెటిక్స్ టోర్నీలో పసిడితో పాటు రజతం గెలిచిన సిమ్రాన్‌కు గైడ్‌గా వ్యవహరించిన ఉమర్ సైఫీ డోపింగ్‌లో చిక్కుకున్నాడు. జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ(నాడా) తాజాగా విడుదల చేసిన జాబితాలో ఉమర్ పేరు ఉంది.
ఢిల్లీ స్టేట్ ఓపెన్ టోర్నీ సందర్భంగా గత నెల 7న నిర్వహించిన డోపింగ్ పరీక్షల్లో ఉమర్ నిషేధిత ఉత్ప్రేరకం డ్రోస్టానోలోన్ తీసుకున్నట్లు తేలింది. ఉమర్ తనపై వచ్చిన డోపింగ్ ఆరోపణలపై అప్పీల్ చేసుకునే అవకాశముంది.