సైప్రస్ : ప్రతిష్టాత్మక క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో భారత యువ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద మళ్లీ గాడిలో పడ్డాడు. గత గేమ్‌ను చేజార్చుకున్న ప్రజ్ఞానంద..బుధవారం మతియస్ బ్లూబమ్(జర్మనీ)తో జరిగిన నాలుగో రౌండ్ పోరును డ్రా చేసుకున్నాడు.
మరోవైపు ఫాబియానో కరువానపై జావోకిర్ సిండ్రోవ్ గెలువగా, అనీశ్ గిరి 1-0తో అండ్రె ఎసిపెంకోపై విజయం సాధించాడు. మహిళల విభాగంలో భారత జీఎం దివ్యా దేశ్‌ముఖ్ 0-1తో జు జినర్ చేతిలో ఓడగా, వైశాలి, అలెగ్జాం డ్రా గోరిచికిన మ ధ్య గేమ్ 1-1తో డ్రాగా ముగిసింది.