అమ్మాన్ (జోర్డాన్) : ఏషియన్ అండర్-15, 17 బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో యువ భారత బాక్సర్లు జోరు కొనసాగిస్తున్నారు. బుధవారం జరిగిన పురుషుల అండర్-15 క్వార్టర్స్‌లోని వివిధ కేటగిరీల్లో గెలిచిన ఐదుగురితో పాటు ఒక మహిళా బాక్సర్ సెమీస్‌కు ప్రవేశించింది. పురుషుల విభాగంలో రుద్రాక్ష్ సింగ్ (46 కిలోలు), సంచిత్ జయాని (49 కి.), ప్రీక్షిత్ (40 కి.), హర్సిల్ (37 కి.), సంస్కార్ వినోద్ (35 కి.) తమ ప్రత్యర్థులను మట్టికరిపించి సెమీస్‌కు చేరారు. మహిళల 43 కిలోల విభాగంలో మిల్కీ.. 5-0తో యెల్దన (కజకిస్థాన్)ను చిత్తు చేసింది.