మస్కట్: ప్రతిష్ఠాత్మక జూనియర్ ఆసియాకప్‌లో యువ భారత్ దుమ్మురేపింది. కుర్రాళ్లు కొదమసింహాల్లా కదంతొక్కారు. డిఫెండింగ్ చాంపియన్ హోదాకు న్యాయం చేస్తూ బుధవారం ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఫైనల్లో భారత్త 5-3తో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై విజయదుందుభి మోగించింది. వరుసగా మూడోసారి టైటిల్‌ను ఒడిసిపట్టుకుని హ్యాట్రిక్‌ను ఖాతాలో వేసుకుంది.
ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన తుది పోరులో యువ భారత్ తరఫున అరైజీత్సింగ్ హండల్ ఏకంగా నాలుగు గోల్స్(4ని, 18ని, 47ని, 54ని) చేయగా, దిల్రాజ్సింగ్(19ని) మరో గోల్ నమోదు చేశాడు. సుఫియాన్ ఖాన్(30ని, 39ని), హన్నన్ షాహిద్(3ని) పాకిస్థాన్‌కు గోల్స్ అందించారు. మూడో స్థానం కోసం వర్గీకరణ పోరులో జపాన్ 2-1తో మలేషియాపై విజయం సాధించింది. భారత్, పాక్ ఫైనల్ పోరు రసవత్తరంగా సాగింది. ఇరు జట్లు తొలి క్వార్టర్లో బంతిపై పట్టు సాధించేందుకు బాగా ప్రయత్నించాయి. అయితే మ్యాచ్ 3వ నిమిషంలో హన్నన్ గోల్‌తో పాక్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.
నిమిషం వ్యవధిలోనే దక్కిన మొదటి పెనాల్టీ కార్నర్‌ను అరైజీత్ గోల్ చేయడంతో స్కోరు 1-1తో సమమైంది. ఇదే దూకుడు రెండో క్వార్టర్లో కొనసాగించిన భారత్‌కు 18వ నిమిషంలో అరైజీత్ గోల్‌తో పాటు దిల్‌రాజ్ గోల్‌తో ఆధిక్యం 3-1కి చేరింది. మూడో క్వార్టర్లో పుంజుకున్న పాక్ 30వ నిమిషంలో సుఫియాన్ గోల్‌తో పోటీలోకి వచ్చింది. 47వ నిమిషంలో అరైజీత్ ఫీల్డ్ గోల్‌తో మ్యాచ్‌పై భారత్ పట్టు సాధించింది. మ్యాచ్ మరో 10 నిమిషాల్లో ముగుస్తుందనగా దక్కిన పెనాల్టీ కార్నర్లను భారత్ గోల్స్‌గా మలువడంతో పాక్‌పై విజయం ఖరారైంది.