హైదరాబాద్, ఆట ప్రతినిధి: లప్లేన్ ఇంటర్నేషనల్ చెస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ యువ గ్రాండ్‌మాస్టర్ రాజారిత్విక్ రన్నరప్‌గా నిలిచాడు. ఫ్రాన్స్‌లోని లప్లేన్లో జరిగిన టోర్నీలో రిత్విక్ తొమ్మిది రౌండ్లలో ఏడు పాయింట్లతో రెండో స్థానంతో రజతం దక్కించుకున్నాడు.
ఈ టోర్నీలో 22 దేశాల నుంచి 184 మంది మేటి ప్లేయర్లు పోటీపడ్డారు. తొమ్మిది రౌండ్లలో రిత్విక్ అజేయంగా నిలిచి రన్నరప్ టైటిల్ ఖాతాలో వేసుకున్నాడు. ఐదు గేమ్స్‌లో గెలిచిన ఈ యువ జీఎం నాలుగింటిని డ్రా చేసుకున్నాడు.