హైదరాబాద్: జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న యువ చెస్ ప్లేయర్లకు ఆర్థిక ప్రోత్సాహం లభించింది. మంగళవారం నగరంలో జరిగిన కార్యక్రమంలో అంతర్జాతీయ మాస్టర్ వంతికా అగర్వాల్‌తో పాటు శుభి గుప్తా, చార్వి అనిల్‌కుమార్, సరయు వేల్పుల, సాహితి వర్షిణికి 64 స్కేర్స్తో పాటు చెస్ స్టార్టప్ కంపెనీ ఎమ్‌జీడీ1 అండగా నిలిచాయి.
ఏడాది పాటు ఈ ఐదుగురు ప్లేయర్లు టోర్నీల్లో పోటీపడేందుకు అయ్యే ఖర్చులు, శిక్షణను భరించనున్నాయి.