Lovlina Borgohain | గువాహటి: టోక్యో(2020) ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన యువ బాక్సర్ లవ్లీనా బోర్గోహెయిన్ తన వెయిట్ కేటగిరీ విషయంలో సందిగ్ధంలో పడింది. సాధారణంగా 75 కిలోల విభాగంలో పోటీ పడే ఆమె.. అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం (ఐవోసీ) తాజా నిబంధనలతో అయితే 70 కి. లేదా 80 కి.ల విభాగానికి మారాల్సి వచ్చింది.
2028 లాస్ఎంజిల్స్ ఒలింపిక్స్ నుంచి 75 కి. వెయిట్ క్లాస్‌ను ఐవోసీ తొలిగించడమే ఇందుకు కారణం.