హైదరాబాద్, ఆటప్రతినిధి: యువ బ్యాటర్ హృషికేశ్ సింహా ధనాధన్ ఆటతీరుతో అదరగొట్టాడు. ముస్తాక్ అలీ టీ20 టోర్నీ కోసం హెచ్సీఏ నిర్వహించిన ప్రాబబుల్స్ మ్యాచ్ల్లో హృషికేశ్ సెంచరీ సహా అర్ధసెంచరీతో విజృంభించాడు.
గురువారం ఎన్ఎఫ్సీ గ్రౌండ్లో జరిగిన మ్యాచ్లో సింహా(52 బంతుల్లో 100 నాటౌట్, 10 ఫోర్లు, 6 సిక్సర్లు) అజేయ సెంచరీతో బ్లూ టీమ్ 20 ఓవర్లలో 245/2 స్కోరు చేయగా, ఛేదనలో గ్రీన్ 208/6 పరుగులే చేసింది.