Paralympics 2024 : పారాలింపిక్స్‌లో భారత క్రీడాకారులు పంజా విసురుతున్నారు. బ్యాడ్మింటన్‌లో తులసీమథీ మురుగేశన్ (Thulasimathi Murugesan) ఫైనల్‌కు చేరి పతకం ఖాయం చేయగా.. డిస్కస్ త్రోలో యోగేశ్ కథునియా (Yogesh Kathuniya) రజతం కొల్లగొట్టాడు. సోమవారం జరిగిన డిస్కస్ త్రో ఎఫ్56 ఫైనల్లో యోగేశ్ పతకంతో గర్జించాడు. తన బలాన్నంత కూడదీసుకొని డిస్కస్‌ను 42.22 మీటర్ల దూరం విసిరాడు. రెండో స్థానంలో నిలిచిన యోగేశ్ విశ్వ క్రీడల్లో దేశానికి మూడో రజతం అందించాడు.
పారాలింపిక్స్‌లో యోగేశ్ అంచనాలు అందుకున్నాడు. సోమవారం జరిగిన ఫైనల్లో 22 ఏండ్ల ఈ అథ్లెట్.. డిస్కస్‌ను తొలి ప్రయత్నంలోనే డిస్సస్ను 42.22 మీటర్ల దూరం విసిరాడు. ఈ పోటీల్లో బ్రెజిల్‌కు చెందిన క్లాడినె బతిస్తా హ్యాట్రిక్ గోల్డ్ మెడల్ సాధించాడు. పారిస్‌లో క్లాడినె డిస్కస్‌ను 46.86 మీటర్ల దూరం విసిరి స్వర్ణం కొల్లగొట్టాడు.
What a Champion’s Moment!
With sheer grit and determination @YogeshKathuniya , has cliched a Silver medal in the Men’s Discus Throw F56 at the Paralympics 2024!
From overcoming challenges to standing tall on the global stage, his achievement is not just a win for him but an… pic.twitter.com/dAO2Pmr8P0
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) September 2, 2024
తులసీమథీ మురుగేశన్
పారిస్ ఆతిథ్యమిస్తున్న పారాలింపిక్స్‌లో భారత్‌కు తులసీమథి మురుగేషన్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇండియాకే చెందిన మనీషా రామదాసు(Manisha Ramadasu)తో హోరాహోరీగా సాగిన సెమీ ఫైనల్లో 23-21, 21-17తో విజయం సాధించింది. తద్వారా పారాలింపిక్స్ ఫైనల్లో అడుగుపెట్టిన తొలి భారత పారా షట్లర్‌గా రికార్డు సొంతం చేసుకుంది.
ఇప్పటివరకూ ఈ పోటీల్లో భారత్‌కు ఏడు పతకాలు వచ్చాయి. షూటింగ్లో అవని లేఖరా(Avani Lekhara) గోల్డ్ మెడల్‌తో బోణీ కొట్టగా.. మోనా అగర్వాల్, మనీశ్ నర్వాల్‌లు కాంస్యంతో మెరిశారు. అనంతరం 100 మీటర్ల రేసులో ప్రీతి పాల్ కంచు మోత మోగించింది. అంతేకాదు 200 మీటర్ల పోటీలోనూ ప్రీతి కాంస్యం కొల్లగొట్టింది. శనివారం జరిగిన 10మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్1 విభాగంలో రుబీనా ఫ్రాన్సిస్ రజతంతో మెరిసింది.