Yashasvi Jaiswal | ముంబై : దేశవాళీ దిగ్గజం ముంబై జట్టును యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్ వీడటం ఈ మధ్య వార్తల్లో ప్రముఖంగా నిలిచింది. స్టార్ క్రికెటర్లతో కూడిన ముంబై జట్టుకు ఆడటమనేది ప్రతీ ఒక్క ప్లేయర్ కల. అలాంటిది అనూహ్యంగా ముంబైని జైస్వాల్ వీడటంపై ఒక ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. ఈ మధ్యే ముగిసిన రంజీ టోర్నీలో జమ్ముకశ్మీర్‌తో మ్యాచ్ సందర్భంగా ముంబై కెప్టెన్ రహానే, జైస్వాల్ మధ్య విబేధాలు ఏర్పడినట్లు తెలిసింది.
కోపంతో రహానే కిట్‌బ్యాగ్‌ను తన్నడంపై ముంబై టీమ్ మేనేజ్మెంట్ జైస్వాల్‌ను వివరణ అడిగినట్లు వినికిడి. క్షమాపణ చెప్పేందుకు అంగీకరించని జైస్వాల్..రానున్న రంజీ సీజన్లో ముంబై నుంచి గోవాకు మారేందుకు కారణమైందని బయటపడింది. గోవా తనకు కెప్టెన్సీ అవకాశమిస్తున్నదని జైస్వాల్ చెబుతున్నప్పటికీ రహానేతో గొడవ దీనికి కారణమని ముంబై క్రికెట్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది.