Vizag ODI : టెస్టుల్లో రికార్డు బ్రేకర్‌గా అవతరించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్(77 నాటౌట్) వన్డేల్లో ఎట్టకేలకు యాభై కొట్టాడు. రాంచీ, రాయ్‌పూర్‌లో నిరాశపరిచిన ఈ కుర్రాడు వైజాగ్‌లో టైమ్ తీసుకొని ఆడి.. ఈ ఫార్మాట్లో తొలి హాఫ్ సెంచరీ సాధించాడు. మరోఎండ్‌లో దంచేస్తున్న రోహిత్ శర్మ(75) శతకం చేజార్చుకున్నాడు. మహరాజ్ ఓవర్లో డీప్ మిడ్ వికెట్ దిశగా భారీ షాట్ ఆడిన హిట్‌మ్యాన్ అక్కడే ఉన్న బ్రీట్జ్ చేతికి చిక్కాడు. దాంతో.. 155 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.
కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గాయపడడంతో వన్డేల్లో ఓపెనింగ్ ఛాన్స్ దక్కించుకున్న యశస్వీ జైస్వాల్ (77 నాటౌట్) ఎట్టకేలకు రాణించాడు. రాంచీ, రాయ్‌పూర్ వన్డేల్లో దక్షిణాఫ్రికా పేసర్ మార్కో యాన్సెన్ ఓవర్లో పేలవ షాట్లకు వెనుదిరిగి విమర్శల పాలైన యశస్వీ.. వైజాగ్‌లో అర్ధ శతకంతో మెరిశాడు.
Maiden FIFTY in ODIs for Yashasvi Jaiswal ✨#TeamIndia 140/0 after 24 overs
Updates ▶️ https://t.co/HM6zm9o7bm#INDvSA | @IDFCFIRSTBank | @ybj_19 pic.twitter.com/NX6NXpzmAi
— BCCI (@BCCI) December 6, 2025
తన సహజ శైలికి విరుద్దంగా ఎక్కువ బంతులు ఆడిన ఈ యంగ్‌స్టర్.. నింగిడి ఓవర్లో సింగిల్ తీసి వన్డేల్లో మొట్ట మొదటి అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఆతర్వాత గేర్ మార్చిన యశస్వీ వరుసగా రెండు ఫోర్లు బాదాడు. అయితే.. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన రోహిత్ శర్మ(75)ను మహరాజ్ వెనక్కి పంపాడు. ప్రస్తుతం యశస్వీకి జతగా విరాట్ కోహ్లీ( 5 నాటౌట్) ఆడుతున్నాడు. 28 ఓవర్లకు టీమిండియా స్కోర్.. 169–1.