IND vs ENG : భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (100 నాటౌట్ ) శతకంతో రెచ్చిపోయాడు. ఓవల్ మైదానంలో బౌండరీలతో ఊచకోత కోసిన ఈ యంగ్‌స్టర్ లంచ్ తర్వాత.. మూడంకెల స్కోర్ అందుకున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్లో అతడికిది ఆరో సెంచరీ కాగా అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో రెండోది. అట్కిన్సన్ ఓవర్లో డబుల్, ఆపై సింగిల్ తీసి సెంచరీ సాధించాడీ హిట్టర్. కేవలం 127 బంత్లులోనే 11 ఫోర్లు, 2 సిక్సర్లతో వంద కొట్టేశాడు. అనంతరం గ్లాలోకి పంచ్‌లు విసురుతూ.. డ్రెస్సింగ్ రూమ్‌వైపు నేను ఉన్నాను అనే సంకేతం చూపిస్తూ సంబురాలు చేసుకున్నాడీ ఓపెనర్.
మూడో రోజు యశస్వీ(104 నాటౌట్), ఆకాశ్ దీప్(66)ల జోరుతో భారీ స్కోర్ దిశగా సాగుతోంది టీమిండియా. మూడో వికెట్‌కు 107 రన్స్ జోడించిన ఈ ద్వయాన్ని ఓవర్టన్ విడదీసి ఇంగ్లండ్‌కు ఊరటనిచ్చాడు. ఆ తర్వాత శుభ్‌మన్ గిల్ (11) సౌకర్యంగానే కనిపించాడు. కానీ, భోజన విరామం తర్వాత తొలి ఓవర్లోనే గిల్‌ను అట్కిన్సన్ ఎల్బీగా ఔట్ చేసి టీమిండియాకు షాకిచ్చాడు. దాంతో189 వద్ద నాలుగో వికెట్ పడింది. క్రీజులోకి వచ్చిన కరుణ్ నాయర్(12 నాటౌట్) డిఫెన్స్‌తో అదరగొడుతున్నాడు. యశస్వీకి తోడుగా అతడు 34 రన్స్ జోడించాడు. ప్రస్తుతం 224 రన్స్ కొట్టిన గిల్ సేన ఆధిక్యాన్ని రెండొందలకు పెంచుకుంది.
💯 𝗳𝗼𝗿 𝗬𝗮𝘀𝗵𝗮𝘀𝘃𝗶 𝗝𝗮𝗶𝘀𝘄𝗮𝗹!👏 👏
This is his 6th Test ton and 2nd hundred of the series! 🙌 🙌
Updates ▶️ https://t.co/Tc2xpWMCJ6#TeamIndia | #ENGvIND | @ybj_19 pic.twitter.com/PnCd6tsgtH
— BCCI (@BCCI) August 2, 2025