ముంబై: ఈ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్ మాంచి ఊపు మీద ఉంది. వరుసగా నాలుగు విజయాలు అందించిన కిక్‌ను ప్లేయర్స్ కూడా బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. గురువారం రాత్రి రాజస్థాన్‌పై 10 వికెట్లతో ఈజీగా గెలిచిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో స్పిన్నర్ యజువేంద్ర చాహల్ చేసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను లక్ష్యంగా చేసుకొని చాహల్ ఈ ఫన్నీ వీడియో చేశాడు. ఒక్క ఫోన్ కోసం మ్యాక్స్‌వెల్ ఈజీ క్యాచ్‌ను డైవ్ చేసి పట్టుకున్నట్లు బిల్డప్ ఇచ్చాడని చాహల్ అన్నాడు.
మ్యాచ్‌లో నేను రెండు క్యాచ్‌లు పట్టుకున్నాను. కష్టమైన క్యాచ్‌లను కూడా ఎంతో సులువన్నట్లుగా నేను క్యాచ్ చేశాను. కానీ ఆ మూలకు ఉన్న వ్యక్తి (మ్యాక్స్‌వెల్‌ను చూపిస్తూ)ని చూడండి. అతడు ఒక్క క్యాచ్ పట్టుకున్నాడు. ఈజీ క్యాచ్‌ను డైవ్ చేసి పట్టుకున్నట్లు బిల్డప్ ఇచ్చాడు. కేవలం ఓ ఫోన్ కోసం అంటూ చాహల్ చెప్పడం విశేషం. తన బాధను డ్రెస్సింగ్ రూమ్‌లోని ప్రతి ఒక్కరి దగ్గరికీ వెళ్లి చెప్పుకున్నాడు.
కోచ్‌తోపాటు స్టార్ బ్యాట్స్‌మన్ డివిలియర్స్, షాబాజ్.. చివరికి మ్యాక్స్‌వెల్ దగ్గరికి కూడా వెళ్లి తన గోడు వెల్లబోసుకున్నాడు. అతనికి షాబాజ్ సపోర్ట్ ఇచ్చాడు. అవును నువ్వు టీమ్ కోసం ఆడతావు కాబట్టి.. కష్టమైన క్యాచ్‌ను కూడా ఈజీగా కనిపించేలా చేశావు. కానీ కొంత మంది మాత్రం ఫోన్ కోసం ఈజీ క్యాచ్‌ను కూడా కష్టమైన దానిగా చేస్తారని షాబాజ్ అనడం విశేషం.
Bold Diaries: The Yuzi Chahal Show
— Royal Challengers Bangalore (@RCBTweets) April 24, 2021
When Yuzi is in his elements, laughter is guaranteed. Here’s what happened in the dressing room after our match against RR. 😂#PlayBold #WeAreChallengers #IPL2021 #RCBvRR pic.twitter.com/tF0e9PKOWo