Steve Smith | ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ (Steve Smith) తెలుగు సినిమాల్లోని డైలాగులు (Telugu Dialogue) చెబుతూ అభిమానులను అలరించాడు. లండన్ (London)లో భారత్ (India)తో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్ (WTC Final) మ్యాచ్‌లో బిజీగా ఉన్న స్మిత్ ఖాళీ సమయంలో స్టార్‌స్పోర్ట్స్-1 తెలుగుతో కాసేపు ముచ్చటించాడు. ఈ క్రమంలో స్మిత్ తనదైన స్టైల్లో యాంకర్ చెప్పిన డైలాగ్స్‌ను చెప్పి నవ్వులు పూయించాడు.
ముఖ్యంగా టాలీవుడ్ లెజెండ్ హీరో బాలకృష్ణ (Balakrishna) డైలాగ్స్‌ని తనదైన మేనరిజంతో చెప్పాడు. ‘అపాయింట్మెంట్ లేకుండా వస్తే వెకేషన్ చూడను, లొకేషన్ చూడను’, ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్. ఇఫ్ యు ట్రబుల్ ది ట్రబుల్… ట్రబుల్ ట్రబుల్స్ యు.. ఐయామ్ నాట్ ది ట్రబుల్. ఐయామ్ ట్రూత్’ డైలాగ్స్‌తో అదరగొట్టాడు. అదేవిధంగా టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రంలోని ‘తగ్గేదే లే’ డైలాగ్‌తోనూ అలరించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను స్టార్‌స్పోర్ట్స్-1 ట్విట్టర్లో పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక క్రికెట్ విషయానికొస్తే.. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా ఆధిక్యంలో కొనసాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. క్రీజులో మార్నస్ లబుషేన్ (41 పరుగులు), కామెరూన్ గ్రీన్ (7 పరుగులు) ఉన్నారు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగుల ఆధిక్యంలో ఉంది.
స్టీవ్ స్మిత్ నోట 🥳
మన తెలుగు సినిమా డైలాగ్స్ 😎మరి తనదైన మనేరిజంతో 🔥
ఎలా అలరించాడో మీరే చూసేయండి 😉చూడండి 👀 #WTCFinalOnStar | #AUSvsIND Day 3 Live
మీ 📺 #StarSportsTelugu/HD & Disney+Hotstar లో #BelieveInBlue pic.twitter.com/maudxIGLoJ— StarSportsTelugu (@StarSportsTel) June 9, 2023
Also Read..
Amazon Forest | ఇదో అద్భుతం.. అమెజాన్ అడవుల్లో విమానం కూలిన 40 రోజుల తర్వాత సజీవంగా చిన్నారులు
Mukesh Ambani | ముకేశ్ అంబానీ మనవరాలి పేరేంటో తెలుసా..?
Bhagavanth Kesari Teaser | అడవి బిడ్డ .. నేలకొండ భగవంత్ కేసరి వచ్చేశాడు