Bhagavanth Kesari Teaser | అడవి బిడ్డ .. నేలకొండ భగవంత్ కేసరి వచ్చేశాడు
Bhagavanth Kesari Teaser | అగ్ర కథానాయకుడు బాలకృష్ణ (Nandamuri Balakrishna) ప్రస్తుతం తన 108వ చిత్రం ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari) లో నటిస్తున్నారు. నేడు బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ‘భగవంత్ కేసరి’ నుంచి ఫస్ట్ టీజర్ (teaser)ను చిత్ర బృందం విడుదల చేసింది.
Bhagavanth Kesari Teaser | అగ్ర కథానాయకుడు బాలకృష్ణ (Nandamuri Balakrishna) ప్రస్తుతం తన 108వ చిత్రం ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari) లో నటిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వం వహిస్తున్నారు. నేడు బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ‘భగవంత్ కేసరి’ నుంచి ఫస్ట్ టీజర్ (teaser)ను చిత్ర బృందం విడుదల చేసింది.
టీజర్లో భగవంత్ కేసరి పాత్రలో బాలకృష్ణ పవర్ ఫుల్ క్యారెక్టర్ని చూపించారు. పాలకుడి అహంకారానికి, మొండివాడికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని బాలకృష్ణ వివరించడంతో టీజర్ ప్రారంభమవుతుంది. టీజర్ ప్రారంభంలో అర్జున్ రాంపాల్‌ను పాలకుడిగా పరిచయం చేయగా.. బాలకృష్ణ తనను తాను మొండి వాడిగా పరిచయం చేసుకుంటారు. ఇక ‘అడవి బిడ్డ .. నేలకొండ భగవంత్ కేసరి. ఈ పేరు చానా ఏళ్లు యాదుంటది’ అంటూ తెలంగాణ యాసలో బాలయ్య అదరగొట్టారు. ఇక ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు తిరుగులేని రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో బాలయ్య సరికొత్త లుక్‌లో కనిపించడంతో నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
ఫాదర్ డాటర్ సెంటిమెంట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాలో శ్రీలీల బాలయ్యకు కూతురుగా కనిపించనుంది. బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal ) నటిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్నాడు. బాలీవుడ్ హీరో అర్జున్ రాంపాల్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ‘అఖండ’ వంటి భారీ విజయం తర్వాత బాలకృష్ణ నుంచి రాబోతున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాల్ని పెట్టుకున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని దసరాకు రిలీజ్ చేయాలని చిత్ర బృందం భావిస్తోంది.
Also Read..
Mukesh Ambani | ముకేశ్ అంబానీ మనవరాలి పేరేంటో తెలుసా..?
Amazon Forest | ఇదో అద్భుతం.. అమెజాన్ అడవుల్లో విమానం కూలిన 40 రోజుల తర్వాత సజీవంగా చిన్నారులు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Train collision | ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం.. ఏడుగరు మృతి 100 మందికి గాయాలు
Fire accident | కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా?
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

