రియాద్ : ఈ ఏడాది నాలుగో గ్రాండ్‌స్లామ్ యూఎస్ ఓపెన్స్‌లో పోలండ్ అమ్మాయి ఇగా స్వియాటెక్‌ను క్వార్టర్స్‌లో ఇంటికి పంపిన అమెరికా సంచలనం అమందా అనిసిమోవ.. తాజాగా డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లోనూ ఆమెకు షాకిచ్చింది.
సౌదీ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో భాగంగా మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో అనిసిమోవ.. 6-7 (3/7), 6-4, 6-2తో రెండో సీడ్ స్వియాటెక్‌ను ఓడించి సెమీస్‌కు అర్హత సాధించింది.