న్యూఢిల్లీ: సీనియర్ వికెట్‌కీపర్ వృద్ధిమాన్ సాహా వివాదంపై బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ దృష్టి సారించబోతున్నది. ఈనెల 23న జరిగే అపెక్స్ కౌన్సిల్ భేటీలో సాహా.. సదరు జర్నలిస్టు ఎపిసోడ్లో త్రిసభ్య కమిటీ నివేదికపై సమీక్ష జరుపనుంది. ఉపాధ్యక్షుడు రాజీవ్‌శుక్లా, కోశాధికారి అరుణ్ ధుమాల్, అపెక్స్ కౌన్సిల్ సభ్యుడు ప్రభ్‌తేజ్ భాటియాతో కూడిన కమిటీ..సాహా ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక రూపొందించనున్నారు. మొత్తం ఏడు పాయింట్ల ఎజెండాతో జరిగే కౌన్సిల్ భేటీలో ఈ అంశం కూడా చర్చకు రానుంది. దీంతో పాటు రంజీ ట్రోఫీ నాకౌట్ దశ వేదికలు, మల్టిడే టోర్నమెంట్లకు నిర్వహణ, ప్రాతినిధ్య ఫీజుపై ఎజెండాలో సభ్యులు చర్చించనున్నారు. ఇదిలా ఉంటే జాతీయ జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన సాహా తనకు ఇంటర్వ్యూ ఇవ్వకపోతే బాగుండదు అంటూ ఒక జర్నలిస్టు బెదిరింపులు దిగాడు. ఈ విషయాన్ని సాహా..సోషల్‌మీడియాలో షేర్ చేయడంతో పలువురు క్రికెటర్లు మద్దతుగా నిలిచారు. దీంతో సిరీయస్‌గా తీసుకున్న బీసీసీఐ విచారణ కమిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.