Vinesh Phogat | శక్తిమంతమైన వ్యక్తికి వ్యతిరేకంగా నిలబడటం చాలా కష్టమని ప్రపంచ ఛాంపియన్షిప్ పతక విజేత రెజ్లర్ (Wrestler) వినేష్ ఫోగట్ (Vinesh Phogat) ఆవేదన వ్యక్తం చేశారు. లైంగిక వేధింపులకు పాల్పడిన భారత రెజ్లింగ్ ఫెడరేషన్ చైర్మన్ (WFI president ) బ్రిజ్ భూషణ్ (Brij Bhushan) పై చర్యలు తీసుకోవాలని టాప్ రెజ్లర్లు (Wrestlers) ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఢిల్లీ (Delhi)లోని జంతర్ మంతర్ (Jantar Mantar) వద్ద గత కొన్ని రోజులుగా రెజ్లర్లు చేపడుతున్న ధర్నా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వినేష్ ఫోగట్ మాట్లాడుతూ.. కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ (Anurag Thakur)పై సంచలన ఆరోపణలు చేశారు.
చాలాకాలం పాటు అధికార దుర్వినియోగానికి పాల్పడుతోన్న ఓ శక్తిమంతమైన వ్యక్తిని ఎదిరించడం చాలా కష్టం అని అన్నారు. మూడు, నాలుగు నెలల క్రితం మొదటిసారి ఆందోళన చేపట్టడానికి ముందు తాము ఓ అధికారిని కలిసి.. మహిళా అథ్లెట్లు ఏ విధంగా లైంగిక వేధింపులకు గురవుతున్నారో వివరించినట్లు చెప్పారు. తాము అన్ని వివరాలను చెప్పినప్పటికీ, ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తాము ధర్నా చేస్తున్నామన్నారు. ఈ ఘటనపై కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ (Anurag Thakur) కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. కమిటీ ద్వారా ఈ వ్యవహారాన్ని అణచివేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
‘లైంగిక వేధింపుల గురించి అథ్లెట్లు అందరూ కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు వివరించాం. మంత్రితో మాట్లాడిన తర్వాత మా నిరసనను నిలిపివేశాం. అయితే, కమిటీని ఏర్పాటు చేసి, ఈ వ్యవహారాన్ని అణచివేసేందుకు ఆయన ప్రయత్నించారు. బ్రిజ్ భూషణ్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు’ అని వినేష్ అన్నారు.
అనంతరం రెజ్లర్ బజరంగ్ పునియా (Bajrang Punia) మాట్లాడుతూ.. ఒలింపిక్స్ కోసం రూపొందించిన నిబంధనలకు వ్యతిరేకంగా తాము నిరసన తెలుపుతున్నట్లు బ్రిజ్ భూషణ్ చెప్తున్నారన్నారు. తాము నిరసన తెలుపుతున్నది ఒలింపిక్స్ కోసం కాదని, లైగింక వేధిపులపై అని స్పష్టం చేశారు.
Also Read..
Karnataka Assembly Elections | మామిడి చెట్టుపై నోట్ల కట్టలు.. స్వాధీనం చేసుకున్న అధికారులు
Sajjanar | బస్సులతో ఆటలా.. చర్యలు తప్పవు : వైరల్ వీడియోపై సజ్జనార్ ఆగ్రహం
Mohammed Shami | షమీకి ఇప్పటికీ వివాహేతర సంబంధాలున్నాయి.. మరోసారి సంచలన ఆరోపణలు చేసిన హసీన్