Mohammed Shami | షమీకి ఇప్పటికీ వివాహేతర సంబంధాలున్నాయి.. మరోసారి సంచలన ఆరోపణలు చేసిన హసీన్
Mohammed Shami | టీంఇండియా (Team India) పేసర్ మహమ్మద్ షమీ (Mohammed Shami)పై అతడి మాజీ భార్య హసీన్ జహాన్ (Hasin Jahan) మరోసారి సంచలన ఆరోపణలు చేసింది. షమీ ఇప్పటికీ కొంతమంది అమ్మాయిలతో వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నాడని ఆరోపించింది.
Mohammed Shami | టీంఇండియా (Team India) పేసర్ మహమ్మద్ షమీ (Mohammed Shami)పై అతడి మాజీ భార్య హసీన్ జహాన్ (Hasin Jahan) మరోసారి సంచలన ఆరోపణలు చేసింది. షమీ ఇప్పటికీ కొంతమంది అమ్మాయిలతో వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నాడని ఆరోపించింది. అంతేకాకుండా షమీ కట్నం కోసం తనని తరచూ వేధించేవాడని తెలిపింది. షమీ అరెస్ట్ వారెంట్ పై ఉన్న స్టేను ఎత్తివేయాలని కోరుతూ తాజాగా ఆమె దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ మేరకు మంగళవారం సుప్రీం కోర్టు (Supreme Court)లో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది.
షమీ-హసీన్ 2014లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ఒక కుమార్తె ఉంది. అయితే ఈ దంపతుల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో 2018లో షమీపై హసీన్ గృహ హింస, దాడి, వరకట్న వేధింపులు వంటి ఆరోపణలు చేసింది. ఈ విషయమై హసీన్ కోర్టును ఆశ్రయించింది. దీంతో షమీపై దాడి, హత్యాయత్నం, గృహ హింస తదితర అభియోగాలపై కేసు నమోదైంది. ఈ క్రమంలోనే 2019 ఆగస్టులో కోల్‌కతాలోని అలిపోర్ కోర్టు.. క్రికెటర్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అయితే దీన్ని షమీ సెషన్స్ కోర్టులో సవాల్ చేయగా.. అరెస్టు వారెంట్, క్రిమినల్ విచారణ ప్రక్రియపై స్టే విధిస్తూ 2019 సెప్టెంబర్‌లో సెషన్స్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
దీంతో హసీన్ ఈ ఏడాది మార్చిలో కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించింది. షమీ అరెస్ట్ వారెంట్‌పై ఉన్న స్టేను ఎత్తివేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. అయితే, కోర్టు అందుకు నిరాకరించింది. ఈ క్రమంలోనే హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ తాజాగా హసీన్ సుప్రీంను ఆశ్రయించింది. షమీపై కేసు నమోదైనప్పటికీ.. ఉద్దేశపూర్వకంగానే గత నాలుగేండ్లుగా విచారణపై స్టేను కొనసాగిస్తున్నారని ఆరోపించింది. ఈమేరకు అతని అరెస్ట్ వారెంట్‌పై ఉన్న స్టేను ఎత్తివేయాలని కోరింది.
ఇదిలా ఉండగా.. షమీపై గృహహింస కేసు నమోదు చేసినప్పుడు.. తనకు భరణం కింద నెలకు రూ.10 లక్షలు ఇవ్వాలని ఆమె కోర్టులో కేసు వేసింది. అందులో రూ.7 లక్షలు తన ఖర్చుల నిమిత్తం కాగా, మరో రూ.3 లక్షలు కుమార్తె కోసమని పేర్కొంది. దీనిపై ఈ ఏడాది జనవరిలో విచారణ జరిపిన కోల్‌కతా హైకోర్టు.. హసీన్ (Hasin Jahan)కు భరణం కింద ప్రతి నెలా రూ.1.30లక్షలు చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో రూ.50వేలు హసీన్‌కు కాగా, మరో రూ.80వేలు కుమార్తె బాగోగుల కోసం చెల్లించాల్సిందిగా ఉత్తర్వుల్లో ఆదేశించింది.
Also Read..
Zero Shadow day | ఈ నెల 9న హైదరాబాద్‌లో జీరో షాడో డే.. 2 నిమిషాల పాటు నీడ కనిపించదు
Body Guard | జీతం ఇవ్వలేదని.. మంత్రిని కాల్చి చంపిన బాడీగార్డ్
India Corona | 24 గంటల్లో 3,720 కొత్త కేసులు.. 20 మరణాలు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

