Yazvendra Chahal | క్రికెటర్‌ను ఎత్తిపడేసిన రెజ్లర్.. వీడియో వైరల్..!
Yazvendra Chahal : భారత లెగ్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్(Yazvendra Chahal) కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. టీ 20 స్పెషలిస్ట్‌గా వెలుగొందిన చాహల్ ఏడాది క్రితం టీమిండియాలో చోటు కోల్పోయాడు. తాజాగా సెంట్రల్ కాంట్రాక్ట్ (Central Contract)లోనూ...
Yazvendra Chahal : భారత లెగ్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్(Yazvendra Chahal) కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. టీ 20 స్పెషలిస్ట్‌గా వెలుగొందిన చాహల్ ఏడాది క్రితం టీమిండియాలో చోటు కోల్పోయాడు. తాజాగా సెంట్రల్ కాంట్రాక్ట్ (Central Contract)లోనూ అతడి పేరు లేదు. దాంతో, ఈ లెగ్ స్పిన్నర్ కెరీర్ ముగిసినట్టేనని అనుకుంటున్నారంతా. ఈ సమయంలో చాహల్ వీడియో ఒకటి ఆన్లైన్లో వైరల్ అవుతోంది.
అందులో స్టార్ రెజ్లర్ సంగీత ఫోగట్(Sangeeta Phogat) అతడిని అమాంతం ఎత్తి పడేసింది. ఝలక్ దిక్లాజా (Jhalak Dikhhla Jaa) డాన్స్ షో వాళ్లు ఏర్పాటు చేసిన పార్టీలో ఈ సంఘటన జరిగింది. స్టార్ రెజ్లర్ భజ్రంగ్ పూనియా భార్య అయిన సంగీత.. బక్కపల్చని చాహల్‌ను అమాంతం భుజాన ఎత్తుకొని గాల్లో రెండు మూడు రౌండ్లు తిప్పింది. దాంతో, చాహల్ నన్ను వదిలయే తల్లీ అంటూ సంగీతను సరదాగా వేడుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం ఆన్లైన్లో వైరల్ అవుతోంది.
చాహల్ భార్య ధనశ్రీ వర్మ(Dhanshree Varma) డాన్సర్ అని తెలిసిందే. ఆమె ఝలక్ దిక్లాజా డాన్స్ షో 11వ ఎడిషన్ ఫైనల్ చేరింది. టైటిల్ పోరుకు ఆమెతో కలిపి ఐదుగురు అర్హత సాధించారు. దాంతో, ధనశ్రీకి ఓటు వేయాలని చాహల్ అభిమానులను అభ్యర్థించాడు. గత కొంత కాలంగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన చాహల్ ఐపీఎల్ 17వ సీజన్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ లెగ్ స్పిన్నర్ రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) తరఫున బరిలోకి దిగనున్నాడు. మార్చి 22 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.
డాన్స్ కలిపింది ఇద్దరినీ..
బంతితో బ్యాటర్లను ఇరుకున పెట్టే లెగ్ స్పిన్నర్ చాహల్ ఓ లవర్ బాయ్. మేటి బ్యాటర్లను సైతం వణికించే చాహల్ డాన్సర్, డెంటిస్ట్ అయిన ధనశ్రీతో ప్రేమలో పడ్డాడు. ఆన్లైన్ క్లాస్‌ల పేరుతో ఆమెతో పరిచయం పెంచుకున్న చాహల్ కొన్ని రోజులకే ధనశ్రీకి ప్రపోజ్ చేశాడు. ఆమె కూడా ఓకే చెప్పడంతో ఇద్దరూ 2020 డిసెంబర్ 22న పెండ్లి చేసుకున్నారు.
చాహల్, ధనశ్రీ

ఇవి కూడా చదవండి
- Naatu Naatu | నాటు నాటు సాంగ్‌కు ఖాన్ త్రయం డ్యాన్స్.. ట్రెండింగ్‌లో వీడియో
- Minister Ponnam Prabhakar | ఒక్కో ఇంటికి రూ.వెయ్యి విలువైన కరెంటు ఉచితంగా ఇస్తున్నాం: మంత్రి పొన్నం
- Hardhik Pandya | ఐపీఎల్‌తోనే ఈ స్థాయికి.. నా జీవితంలో అద్భుతమైన ఏడాది అదే..!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

