Naatu Naatu | ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేశ్ అంబానీ (Mukesh Ambani) కుమారుడు అనంత్ అంబానీ -రాధికా మర్చంట్ ఓ ఇంటివారు కాబోతున్న విషయం తెలిసిందే. వివాహ వేడుకలో భాగంగా నిర్వహించిన ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాయి. ఈ వేడుకలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి సెలబ్రిటీలు హాజరయ్యారు. యావత్ ప్రపంచాన్ని షేక్ చేసిన తెలుగు పాట నాటు నాటు (Naatu Naatu) ప్రీ వెడ్డింగ్ ఈవెంట్లో ఓ ఊపు ఊపేసింది. ఈ సాంగ్‌కు ముగ్గురు స్టార్ సెలబ్రిటీలు డ్యాన్స్ చేసి అభిమానులను హోరెత్తించారు.
ఆస్కార్ విజేతగా నిలిచిన నాటు నాటు సాంగ్‌కు బాలీవుడ్ ఖాన్ త్రయం షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్.. తమదైన స్టైల్లో హుక్ స్టెప్పులతో కలిసి స్టైలిష్ స్టెప్పులేశారు. రాంచరణ్ కూడా వీరితో జాయిన్ అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈవెంట్లో టాలీవుడ్ స్టార్లు రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి సందడి చేయగా.. వారి చూస్తుండగా అద్భుతమైన ఎనర్జీ లెవల్స్‌తో ముగ్గురు స్టార్ సెలబ్రిటీలు చేసిన నాటు నాటు స్టెప్పుల వీడియో ఈవెంట్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
Naacho naacho naacho naacho ⁰Naacho naacho yaara naacho… 🤩 pic.twitter.com/lK1TKv4y5K
— RRR Movie (@RRRMovie) March 3, 2024
Jamnagar, Gujarat: Actors Jaaved Jaaferi, Shah Rukh Khan, Alia Bhatt, Ranbir Kapoor, Salman Khan, Ram Charan, and Aamir Khan during pre-wedding celebrations of Anant Ambani and Radhika Merchant. pic.twitter.com/IzQS5enP4E
— ANI (@ANI) March 3, 2024