WPL Auction | డబ్ల్యూపీఎల్ వేలంలో మంధానకు అత్యధిక ధర
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) వేలంలో భారత ఓపెనర్ స్మృతి మంధానకు భారీ ధర దక్కింది. రూ. 3.40 కోట్లకు ఈ స్టార్ క్రికెటర్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ కొనుగోలు చేసింది.
WPL Auction : మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) వేలంలో భారత ఓపెనర్ స్మృతి మంధానకు అత్యధిక ధర దక్కింది. అందరూ ఊహించినట్టుగానే ఈ స్టార్ ప్లేయర్ వేలంలో కళ్లు చెదిరే ధర పలికింది. రూ. 3.40 కోట్లకు ఈ స్టార్ క్రికెటర్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ కొనుగోలు చేసింది. దాంతో, డబ్ల్యూపీఎల్ తొలి సీజన్లో అత్యధిక ధర పలికిన క్రికెటర్‌గా మంధాన గుర్తింపు సాధించింది. రూ. 50 లక్షల కనీస ధర ఉన్న మంధానను కొనుగోలు చేసేందుకు ఐదు జట్లు పోటీ పడ్డాయి. చివరకు ఆర్సీబీ భారీ ధరకు ఈమెను దక్కించుకుంది.
భారత ఆల్‌రౌండర్ రేణుకా సింగ్‌ను కూడా ఆర్సీబీ సొంతం చేసుకుంది. రూ. 1.5 కోట్లకు ఆమెను కొనుగోలు చేసింది. వేలంలో ఎలిసా పెర్రీని (ఆస్ట్రేలియా) రూ.1.7 కోట్లకు ఈ ఫ్రాంఛైజీ దక్కించుకుంది. అంతేకాదు సోఫీ డెవినె (న్యూజిలాండ్) రూ.50 లక్షలకు సొంతం చేసుకుంది.
బీసీసీఐ తొలిసారిగా నిర్వహిస్తున్న డబ్ల్యూపీఎల్ వేలం ముంబై వేదికగా జరుగుతోంది. మొత్తం 409మంది క్రికెటర్లు వేలంలో ఉన్నారు. ఐదు ఫ్రాంఛైజీలు 90 మందిని కొనుగోలు చేసేందుకు పోటీ పడుతున్నాయి. మార్చి 4న ముంబై వేదికగా డబ్ల్యూపీఎల్ టోర్నీ ప్రారంభం కానుంది.
Base Price: INR 50 Lakh
Goes to @RCBTweets: INR 3.40 Crore
How about that for the first-ever Player Bid in the history of the #WPLAuction! 👏 👏 #WPL2023 #WPL2023 #RCB pic.twitter.com/CPXLJsJ7gO
— Women’s Premier League (WPL) #WPL2023 (@wpl2023) February 13, 2023
Virat Kohli the No.18 plays for RCB in IPL.
Smriti Mandhana the No.18 will play for RCB in WPL.#WPLAuction #WPL2023 #WPL #PlayBold #CricketTwitter pic.twitter.com/GQ9yVXXwlg
— Women’s Premier League (WPL) #WPL2023 (@wpl2023) February 13, 2023
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

