WPL Auction | డబ్ల్యూపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికింది వీళ్లే
బీసీసీఐ తొలిసారిగా నిర్వహిస్తున్న మహిళల ప్రీమియర్ లీగ్ వేలంలో భారత ఓపెనర్ స్మృతి మంధాన రికార్డు ధర పలికింది. ఆర్సీబీ రూ.3.40 కోట్లకు కొనుగోలు చేసింది. అష్లెగ్ గార్డ్నర్ , నటాలియె సీవర్ రూ.3.20 కోట్లతో రెండో స్థానంలో నిలిచారు.
WPL Auction : బీసీసీఐ తొలిసారిగా నిర్వహిస్తున్న మహిళల ప్రీమియర్ లీగ్ వేలం ఆసక్తికరంగా సాగుతోంది. ఈ వేలంలో ఇప్పటివరకూ భారత ఓపెనర్ స్మృతి మంధాన రికార్డు ధర పలికింది. అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా నిలిచింది. ఈ స్టార్ క్రికెటర్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.3.40 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. అందరూ ఊహించినట్టుగానే మంధాన భారీ ధర పలికింది. అందరూ ఊహించినట్టుగానే డబ్ల్యూపీఎల్ తొలి సీజన్ వేలంలో మంధాన అత్యంత విలువైన ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేసింది.
డబ్ల్యూపీఎల్ వేలంలో బ్యాటర్ అష్లీ గార్డ్నర్ (ఆస్ట్రేలియా), నటాలియె సీవర్ (ఇంగ్లండ్) రూ.3.20 కోట్ల ధరతో రెండో స్థానంలో నిలిచారు. గార్డ్నర్ను గుజరాత్ జెయింట్స్, నటాలియెను ముంబై ఇండియన్స్ కొనుగోలు చేశాయి.
దీప్తికి రూ. 2.60 కోట్లు
భారత స్పిన్నర్ దీప్తి శర్మ రూ.2.60 కోట్లు పలికింది. టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్‌ను రూ. 2.20 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. ఇండియాకు అండర్ -19 వరల్డ్ కప్ అందించిన షఫాలీ వర్మ వేలంలో అదరగొట్టింది. రూ.2 కోట్లకు ఆమెను ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది.
అండర్ -19 ప్లేయర్స్ హవా
మహిళల ప్రీమియర్ లీగ్ వేలంలో భారత క్రికెటర్ల పంట పండింది. ముఖ్యంగా అండర్ -19 జట్టులోని కీలక ప్లేయర్స్ హవా కొనసాగింది. వీళ్లను కొనుగోలు చేసేందుకు ఫ్రాంఛేజీలు పోటీ పడ్డాయి. కోట్లు కుమ్మరించేందుకు సిద్ధపడ్డాయి. అండర్ -19 టీమ్ కెప్టెన్, లేడీ సెహ్వగ్గా పేరొందిన షఫాలీ వర్మ భారీ ధర పలికింది. ఆమెను రూ.2 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. వికట్ కీపర్ రీచా ఘోష్‌ను రూ.1.9 కోట్లకు ఆర్సీబీ సొంతం చేసుకుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ (ఆల్‌రౌండర్) రూ.1.80 కోట్లు, యస్తికా భాటియా (వికెట్ కీపర్) రూ.1.50 కోట్లు, రేణుకా సింగ్ (పేసర్) రూ.1.50 కోట్లు, స్నేహ్ రానా (ఆల్‌రౌండర్) రూ.75 లక్షలు పలికారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

