WPL Auction : టీమిండియా వికెట్ కీపర్ రీచా ఘోష్‌కు వేలంలో భారీ ధర దక్కింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ. 1.90 కోట్లకు రీచాను సొంతం చేసుకుంది. రూ. 50 లక్షల కనీస ధర ఉన్న రీచా కోసం ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోటీపడ్డాయి. చివరకు ఆర్సీబీ ఆమెను సొంతం చేసుకుంది. టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో రీచా 33 రన్స్ చేసింది. జెమీమా రోడ్రిగ్స్(53)తో కలిసి కీలక భాగస్వామ్యం నిర్మించింది. దాంతో, ఈ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో గెలిచింది.
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) వేలంలో భారత ఓపెనర్ స్మృతి మంధాన అత్యధిక ధర దక్కింది. రూ. 3.40 కోట్లకు ఈ స్టార్ క్రికెటర్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ కొనుగోలు చేసింది. దాంతో, డబ్ల్యూపీఎల్ తొలి సీజన్లో అత్యధిక ధర పలికిన క్రికెటర్‌గా మంధాన గుర్తింపు సాధించింది. రూ. 50 లక్షల కనీస ధర ఉన్న మంధానను ఆర్సీబీ భారీ ధరకు దక్కించుకుంది. భారత ఆల్‌రౌండర్ రేణుకా సింగ్‌ను కూడా ఆర్సీబీ సొంతం చేసుకుంది. రూ. 1.5 కోట్లకు ఆమెను కొనుగోలు చేసింది. వేలంలో ఎలిసా పెర్రీని (ఆస్ట్రేలియా) రూ.1.7 కోట్లకు ఈ ఫ్రాంఛైజీ దక్కించుకుంది. అంతేకాదు సోఫీ డెవినె (న్యూజిలాండ్) రూ.50 లక్షలకు సొంతం చేసుకుంది.
Attacking ✅
Finisher ✅
She is a Keeper, literally 😍🔥Welcome to RCB, Richa Ghosh! 🤩#PlayBold #WeAreChallengers #WPL2023 #WPLAuction #NowARoyalChallenger pic.twitter.com/M76oxuKP2Z
— Royal Challengers Bangalore (@RCBTweets) February 13, 2023