ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) నాలుగో సీజన్ వేలం ప్రక్రియను నవంబర్ ఆఖర్లో నిర్వహించనున్నట్టు సమాచారం. వచ్చేనెల 26-29 మధ్య ఏదో ఒకరోజు ఢిల్లీ వేదికగా ఈ ప్రక్రియను పూర్తిచేయాలని బీసీసీఐ యోచిస్తున్నది. ఇదే విషయాన్ని ఐదు ఫ్రాంచైజీలకు మౌఖికంగా తెలిపినట్టు బోర్డు వర్గాల వినికిడి.