WPL 2024 | ముంబైని ఆదుకున్న మిడిలార్డర్.. యూపీ ముందు ఊరించే లక్ష్యం
WPL 2024, UP vs MI | ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ మిడిలార్డర్ రాణించడంతో యూపీ వారియర్స్ ఎదుట మోస్తారు లక్ష్యాన్ని నిలిపింది. నటాలీ సీవర్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, అమెలియా కెర్ రాణించడంతో ఆ జట్టు..
WPL 2024, UP vs MI | ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ మిడిలార్డర్ రాణించడంతో యూపీ వారియర్స్ ఎదుట మోస్తారు లక్ష్యాన్ని నిలిపింది. నటాలీ సీవర్ (31 బంతుల్లో 45, 8 ఫోర్లు), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (30 బంతుల్లో 33, 3 ఫోర్లు, 1 సిక్సర్), అమెలియా కెర్ (23 బంతుల్లో 39, 6 ఫోర్లు) రాణించడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. యూపీ బౌలర్లలో చమారి ఆటపట్టు రెండు వికెట్లు తీయగా రాజేశ్వరి గైక్వాడ్, దీప్తి శర్మ, సైమా ఠాకూర్లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్‌కు వచ్చిన ముంబై.. నాలుగు ఓవర్లకే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. ఇన్నింగ్స్ తొలి బంతికే ఫోర్ కొట్టిన యస్తికా భాటియా (9)తో పాటు 3 బంతుల్లో 4 పరుగులే చేసిన హేలీ మాథ్యూస్‌ను చమారి ఆటపట్టు పెవిలియన్‌కు పంపింది. 17 రన్స్‌కే రెండు వికెట్లు కోల్పోయిన ముంబైని ఆల్‌రౌండర్ నటాలీ సీవర్ బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్‌లు ఆదుకున్నారు. ఈ ఇద్దరూ మూడో వికెట్‌కు 59 పరుగులు జోడించారు.
వేగంగా ఆడిన సీవర్.. అర్థసెంచరీకి ఐదు పరుగుల దూరంలో ఉండగా రాజేశ్వరి గైక్వాడ్ వేసిన 12వ ఓవర్లో రెండో బంతికి క్లీన్ బౌల్డ్ అయింది. ఆ తర్వాత వచ్చిన అమెలియా కెర్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 28 రన్స్ జోడించిన హర్మన్‌ను సైమా ఠాకూర్ బౌల్డ్ చేసింది. అమన్‌జ్యోత్ కౌర్ (7) నిరాశపరచగా సజన (14 బంతుల్లో 22 నాటౌట్, 4 ఫోర్లు) ఆఖర్లో దూకుడుగా ఆడింది.
Innings break!
Mumbai Indians set a 🎯 of 1⃣6⃣1⃣ for the UP Warriorz 🙌
Which team will return to winning ways 🤔
Find out 🔜
Scorecard 💻📱https://t.co/qcJK240qsL#TATAWPL | #UPWvMI pic.twitter.com/v9IBGP8l7b
— Women’s Premier League (WPL) (@wplt20) March 7, 2024
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Badangpet | బడంగ్‌పేట అక్రమాల్లో కొత్త కోణం.. 250 ఫైళ్లపై గ్రూపుగా ఏర్పడిన కాంట్రాక్టర్లు
Singareni Bonus | బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
Insurance Scam | అల్లుడి కోసం గిల్లుడు.. 1200 కోట్లు మూడేండ్లలో దిగమింగేలా స్కెచ్
Harish Rao | బెనిఫిట్స్ కోసం వృద్ధులు రోడ్డెక్కాలా?.. సీఎం రేవంత్‌ను నిలదీసిన హరీశ్‌రావు
Horoscope | 14-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

