WPL 2024: గత సీజన్లో ముంబై వేదికగా ఐదు జట్లతో అభిమానులను అలరించిన మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)ను ఈ ఏడాది డబుల్ సక్సెస్ చేయడానికి బీసీసీఐ సన్నాహకాలు మొదలుపెట్టింది. గత సీజన్ మొత్తం ముంబై వేదికగానే నిర్వహించిన ఈ టోర్నీని ఈ ఏడాది ఆ నగరంలో కాకుండా బెంగళూరు, ఢిల్లీలో నిర్వహించేందుకు బీసీసీఐ కసరత్తులు మొదలుపెట్టినట్టు సమాచారం. ఈ ఏడాది ఫిబ్రవరి చివరి వారంలో మొదలవవనున్న ఈ లీగ్ దేశ రాజధాని, ఐటీ క్యాపిటల్‌లో జరిగితే అది అభిమానులను మరింత చేరువవడం ఖాయం. దీనిపై బీసీసీఐ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
గత సీజన్లో డాక్టర్ డీ వై పాటిల్ స్టేడియంలోనే మ్యాచ్‌లు అధికంగా జరిగాయి. 2023లో అభిమానులను స్టేడియాలకు రప్పించేందుకు గాను బీసీసీఐ.. మహిళలకు ఉచితంగానే చూసే వీలు కల్పించింది. ఈ ఏడాది కూడా డబ్ల్యూపీఎల్‌ను డబుల్ సక్సెస్ చేసేందుకు ఇదే ఫార్ములాను ఫాలో అవనుందని సమాచారం. గత సీజన్లో ముంబై ఇండియన్స్ – ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ముగిసిన ఫైనల్స్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో ముంబై తొలి టైటిల్‌ను దక్కించుకున్న విషయం తెలిసిందే. డబ్ల్యూపీఎల్‌లో ఇటీవలే వేలం ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో ఐదు జట్లు రెండో సీజన్ కోసం వేచి చూస్తున్నాయి. డబ్ల్యూపీఎల్ ముగిసిన వెంటనే మార్చి 22 నుంచి ఐపీఎల్ – 17 వ సీజన్ మొదలయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
Bangalore & Delhi will host the WPL 2024. [Jagran News/Abhishek Tripathi] pic.twitter.com/uH3aGZSUyq
— Johns. (@CricCrazyJohns) January 10, 2024