WPL 2024, GG vs RCB | గత సీజన్లో విఫలమైనా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్లో ఆశించిన స్థాయిలో ఆడుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) నేడు గుజరాత్ జెయింట్స్‌తో తలపడనుంది. మంగళవారం ఢిల్లీ.. ముంబైని ఓడించడంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి వచ్చిన ఆర్సీబీ.. నేటి మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిస్తే టాప్ పొజిషన్‌కు వెళ్లే ఛాన్స్ ఉంటుంది. మరోవైపు రెండో సీజన్లో ఇంకా బోణీ కొట్టని గుజరాత్.. వేదిక మారితే అయినా అదృష్టం మారుతుందేమోనని కొండంత ఆశతో ఉంది. ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో గుజరాత్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. బెంగళూరు ఫస్ట్ ఫీల్డింగ్‌కు రానుంది.
ఈ సీజన్లో ఐదు మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ.. మూడు గెలిచి రెండు ఓడింది. ఆ జట్టు ఖాతాలో ఆరు పాయింట్లు ఉన్నాయి. అగ్రస్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్.. ఐదు మ్యాచ్‌లలో నాలుగు గెలిచి 8 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఢిల్లీ నెట్ రన్‌రేట్ (+1.301)గా ఉండగా ఆర్సీబీది (+0.242)గా ఉంది. నేటి మ్యాచ్‌లో గనక గుజరాత్‌పై భారీ తేడాతో గెలిస్తే ఆర్సీబీకి అగ్రస్థానానికి వెళ్లే అవకాశముంది.
గత మ్యాచ్‌లో ఆర్సీబీ.. యూపీపై బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ రాణించి ఘన విజయాన్ని అందుకుంది. రెండో సీజన్లో ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా స్మృతి మంధాన (5 మ్యాచ్‌లలో 219) ఉండగా.. ఎల్లీస్ పెర్రీ, రిచా ఘోష్ కూడా మంచి టచ్‌లోనే ఉన్నారు. బౌలర్లలో స్పిన్నర్ మోలినెక్స్, రేణుకా సింగ్ ఠాకూర్, సోఫి డెవిన్లు నిలకడగా రాణిస్తున్నారు. కానీ గుజరాత్ పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. ఆ జట్టు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ వైఫల్యాల ప్రదర్శన కొనసాగిస్తోంది.