WPL 2024 Auction: ముంబై వేదికగా జరుగుతున్న మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) – 2024లో భాగంగా గుజరాత్ జెయింట్స్ యువ బ్యాటర్ ఫోబె లిచ్ఫీల్డ్పై కోటి రూపాయలు వెచ్చించి దక్కించుకుంది. తొలిసారి డబ్ల్యూపీఎల్ వేలంలోకి వచ్చిన ఆమె ఊహించని ధరను సొంతం చేసుకుంది. రూ. 30 లక్షల కేటగిరీలో వచ్చిన ఆమె కోసం గుజరాత్.. అంతగా ఎందుకు ఖర్చు చేసింది..? జాబితాలో స్టార్ బ్యాటర్లు ఎంతమంది ఉన్నా గుజరాత్ ఆమెను ఎందుకు ఎంచుకుంది..?
ఆస్ట్రేలియాకు చెందిన లిచ్‌ఫీల్డ్.. 2003 ఏప్రిల్ 18న న్యూసౌత్‌వేల్స్‌లో జన్మించింది. చిన్నప్పట్నుంచే క్రికెట్‌పై మక్కువ పెంచుకున్న ఆమె.. 19 ఏండ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఎడమ చేతి వాటం బ్యాటర్ అయిన ఆమెన.. 2022లో భారత్ – ఆస్ట్రేలియా మధ్య జరిగిన టీ20 సిరీస్‌లో భాగంగా అరంగేట్రం చేసింది. ఇప్పటివరకూ ఆసీస్ తరఫున అన్ని ఫార్మాట్లలోనూ ఆడిన లిచ్‌ఫీల్డ్.. ఇంటర్నేషనల్ క్రికెట్‌తో పాటు ఉమెన్స్ బిగ్‌బాష్ లీగ్ (డబ్ల్యూబీబీఎల్), దేశవాళీ క్రికెట్లో మెరుపులు మెరిపిస్తోంది.
17 ఏండ్ల (2019లో)కే డబ్ల్యూబీబీఎల్ ఎంట్రీ ఇచ్చిన లిచ్‌ఫీల్డ్.. ఈ లీగ్‌లో సిడ్నీ థండర్స్ తరఫున ఆడుతోంది. తన రెండో మ్యాచ్‌లోనే ఆమె హాఫ్ సెంచరీ బాదింది. డబ్ల్యూబీబీఎల్‌లో హాఫ్ సెంచరీ చేసిన రెండో క్రికెటర్‌గా ఆమె రికార్డులకెక్కింది. డబ్ల్యూబీబీఎల్ కంటే ముందే ఆమె ఉమెన్స్ నేషనల్ క్రికెట్ లీగ్ (డబ్ల్యూఎన్సీఎల్) లో అదరగొట్టింది. గత సీజన్లో ఆమె ఓ సెంచరీతో పాటు మెరుగైన ప్రదర్శనలు చేసింది.
Phoebe Litchfield attracts a bid of INR 1 CR from Gujarat Giants.
Gujarat Giants fans, how excited are you? 🥳#CricketTwitter | #WPLAuction | #WPL2024 pic.twitter.com/KtXcQFU9VP
— Female Cricket (@imfemalecricket) December 9, 2023
అంతర్జాతీయ క్రికెట్లో గతేడాది ఎంట్రీ ఇచ్చిన లిచ్‌ఫీల్డ్.. ఈ ఏడాది టెస్టులలో అరంగేంట్రం చేసింది. 2023 జూన్‌లో ఇంగ్లండ్‌తో ఆడిన టెస్టులో ఆడిన ఆమె ఆ మ్యాచ్‌లో 69 పరుగులు చేసింది. ఇక వన్డేలలో 11 మ్యాచ్‌లు ఆడి 344 పరుగులు చేసింది. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది. ఆసీస్ క్రికెట్లో ఫ్యూచర్ స్టార్‌గా ఎదుగుతున్న లిచ్‌ఫీల్డ్.. వచ్చే సీజన్ నుంచి డబ్ల్యూపీఎల్‌లో ఎలా ఆడుతుందో చూడాలి.
🇦🇺 Phoebe Litchfield to Gujarat Giants for INR 1 crore!#WPLAuction | #WPL2024 pic.twitter.com/ae9UXsuQ5v
— Women’s CricZone (@WomensCricZone) December 9, 2023