బెంగళూరు : వచ్చే నెల 4నుంచి ఆరంభం కానున్న మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యుపీఎల్)లో పాల్గొనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టుకు ఏస్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మెంటార్‌గా వ్యవహరించనున్నది. ఈ మేరకు ఆర్సీబీ ఒక ప్రకటన చేస్తూ దేశంలోని యువ మహిళా క్రీడాకారిణులలో స్ఫూర్తిని నింపేందుకు ఆరు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్, 43 డబ్ల్యుటిఏ టైటిల్స్ సాధించిన సానియాను తమ మెంటార్‌గా నియమించినట్టు తెలిపింది. దీనిపై సానియా స్పందిస్తూ ఆర్సీబీ జట్టులో చేరడం ఎంతో సంతోషంగా ఉందని, ఐపీఎల్లో ఎంతో పేరుగాంచిన ఆర్సీబీ సభ్యురాలిని కావడం గర్వంగా ఉందన్నది.
దేశంలోని యువ క్రీడాకారిణులలో స్ఫూర్తి నింపేందుకు తనవంతు కృషి చేస్తానని సానియా తెలిపింది.