Aryna Sabalenka | ఫ్లోరిడా : ప్రస్తుత మహిళల టెన్నిస్లో ఒకటో సీడ్ గా ఉన్న అరీనా సబలెంక తన కీర్తికిరీటంలో మరో టైటిల్ను జమచేసుకుంది. ‘హార్డ్కోర్ట్ క్వీన్’ గా గుర్తింపు పొందిన ఈ బెలారస్ అమ్మాయి.. ఫ్లోరిడాలో జరుగుతున్న మియామి ఓపెన్లో మహిళల సింగిల్స్ టైటిల్ను కైవసం చేసుకుంది. ఫైనల్లో సబలెంక.. 7-5, 6-2తో నాలుగో సీడ్ జెస్సికా పెగుల (అమెరికా)ను వరుస సెట్లలో చిత్తుచేసి తన కెరీర్లో 19వ టైటిల్ను గెలుచుకుంది. పురుషుల ఫైనల్ జొకోవిచ్-మెన్సిక్ మధ్య జరుగనుంది.