India Open: బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న సౌత్ కొరియా అమ్మాయి అన్ సె యంగ్‌కు భారీ షాక్. ఇండియా ఓపెన్‌లో వరుస విజయాలతో క్వార్టర్స్‌కు చేరిన ఆమె.. మూడో రౌండ్లో గాయం కారణంగా సెట్‌తో పాటు టోర్నీ నుంచి వైదొలగాల్సి వచ్చింది. మోకాలి గాయంతో ఇబ్బందిపడ్డ యంగ్.. శుక్రవారం ఢిల్లీ వేదికగా ముగిసిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో 19-21, 0-3 తేడాతో జియా మిన్ యో (సింగపూర్) చేతిలో ఓడింది.
21 ఏండ్ల సౌత్ కొరియా అమ్మాయి.. గతేడాది అక్టోబర్‌లో చైనా వేదికగా ముగిసిన ఆసియా కప్ సందర్భంగా గాయపడింది. మోకాలి గాయం వేధిస్తున్నా ఆమె ఇండియా ఓపెన్ ఆడింది. తొలి రెండు రౌండ్లలో ఆమె మోకాలి గాయంతోనే ఆడి గెలిచింది. కానీ శుక్రవారం జరిగిన క్వార్టర్స్‌లో మాత్రం.. యంగ్ గాయాన్ని మిన్ ఆసరాగా తీసుకుంది. తొలి సెట్ నుంచే వేగంగా ఆడుతూ యంగ్‌ను కోలుకోనీయకుండా చేసింది. ఆ ప్రణాళికలో ఆమె విజయవంతమైంది.
An Se Young withdraws. Wishing the world No.1 a speedy recovery! 🙏
#BWFWorldTour #IndiaOpen2024 pic.twitter.com/7OsScV65lX— BWF (@bwfmedia) January 19, 2024
తొలి సెట్లో హోరాహోరిగా పోరాడినా రెండు పాయింట్ల తేడాతో సెట్ కోల్పోయిన యంగ్.. రెండో సెట్లో మోకాలికి కట్టు కట్టుకుని మరీ ఆడింది. అయితే రెండో సెట్ మొదలయ్యాక యంగ్ నొప్పిని భరించలేక అర్థాంతరంగా ఆట నుంచి (రిటైర్డ్ హర్ట్) తప్పుకుంది. దీంతో మిన్ విజేతగా నిలిచింది. ఈ ఏడాది జూన్‌లో పారిస్ ఒలింపిక్స్ జరగాల్సి ఉండగా అప్పటివరకూ పూర్తిస్థాయిలో కోలుకోవాలని భావిస్తోంది. ఇక క్వార్టర్స్‌లో గెలిచిన మిన్.. సెమీస్‌లో చైనాకు చెందిన ఆరో సీడ్ తై జూ యింగ్‌తో తలపడనుంది.
#BWF – 🇰🇷 An Se Young had to retire from her match against 🇸🇬 Yeo Jia Min due to injury. Get well soon! 🙏
Catch #IndiaOpen2024 matches LIVE on #SPOTVNOW. 📺 📲 #SPOTVSEA
📸: @badmintonphoto pic.twitter.com/qxXvANcW8w— SPOTV SEA (@SPOTVSEA) January 19, 2024