టురిన్ (ఇటలీ) : ఈ ఏడాది అద్భుత విజయాలతో అదరగొట్టిన టెన్నిస్ యువ సంచలనం కార్లొస్ అల్కరాజ్ (స్పెయిన్).. ఈ సీజన్‌ను నంబర్‌వన్ ర్యాంకుతో ముగించేందుకు సిద్ధమయ్యాడు. ఏటీపీ ఫైనల్స్‌లో అతడు గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో 6-7 (2/7), 7-5, 6-3తో టేలర్ ఫ్రిట్జ్‌ను చిత్తుచేశాడు.
గ్రూప్ స్టేజ్‌లో మరో విజయం సాధిస్తే ఏటీపీ ర్యాంకింగ్స్‌ను అతడు ఒకటో స్థానంతో ముగిస్తాడు. తదుపరి మ్యాచ్‌లో ఈ స్పెయిన్ చిన్నోడు.. లొరెంజొ ముసెట్టి (ఇటలీ)తో తలతపడనున్నాడు.