ముంబై: ఈ నెలాఖరున జరుగబోయే మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) వేలానికి ముందు ఐదు ఫ్రాంచైజీలు వచ్చే సీజన్ కోసం తాము అట్టిపెట్టుకోబోయే ప్లేయర్ల జాబితాను విడుదల చేశాయి. దాదాపు స్టార్ ప్లేయర్లను ఫ్రాంచైజీలను రిటైన్ చేసుకోగా ఇటీవలే ముగిసిన వన్డే ప్రపంచకప్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచిన దీప్తి శర్మను యూపీ వారియర్స్ జట్టు నుంచి విడుదల చేసింది.
అంతేగాక టోర్నీలో అత్యధిక పరుగుల (571) క్రీడాకారిణి లారా వోల్వార్డ్ (దక్షిణాఫ్రికా)ను గుజరాత్ వేలానికి వదిలేసింది. హర్మన్‌ప్రీత్‌ను ముంబై.. స్మృతి మంధాన, రిచాఘోష్ను బెంగళూరు.. జెమీమా రోడ్రిగ్స్, షెఫాలీ వర్మను ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసుకున్నాయి.