ICC World Cup | కల నిజమైన వేళ.. 44 ఏండ్ల తర్వాత ఇంగ్లండ్‌కు ప్రపంచకప్
ప్రపంచానికి క్రికెట్‌ను పరిచయం చేసిన ఇంగ్లండ్ వరల్డ్‌కప్ కోసం మాత్రం చకోర పక్షిలా నిరీక్షించింది. మూడు సార్లు (1979, 1987,1992) ఫైనల్ చేరినా ట్రోఫీని అందుకోలేక పోయింది. ఎట్టకేలకు 2019లో సొంతగడ్డపై ఆ జట్టు 44 ఏళ్ల కల నిజమైంది.
- మోర్గాన్‌సేన సంచలన విజయం
ICC World Cup | ప్రపంచానికి క్రికెట్‌ను పరిచయం చేసిన ఇంగ్లండ్ వరల్డ్‌కప్ కోసం మాత్రం చకోర పక్షిలా నిరీక్షించింది. మూడు సార్లు (1979, 1987,1992) ఫైనల్ చేరినా ట్రోఫీని అందుకోలేక పోయింది. ఎట్టకేలకు 2019లో సొంతగడ్డపై ఆ జట్టు 44 ఏళ్ల కల నిజమైంది. గ్రాహం గూచ్, నాసీర్ హుసేన్, మైఖేల్ వాన్, మార్కస్ ట్రెస్కోథిక్ వంటి గొప్ప కెప్టెన్లకు సాధ్యం కాని దాన్ని ఇయాన్ మోర్గాన్ చేతల్లో చూపించాడు. న్యూజిలాండ్‌తో ఆఖరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ మెరుపు బ్యాటింగ్, జోఫ్రా ఆర్చర్ సూపర్ స్పెల్‌తో అద్వితీయ విజయం సాధించింది. సొంత ప్రేక్షకుల కరతాళ ధ్వనుల మధ్య తొలిసారి ప్రపంచకప్‌ను సగర్వంగా, మురిపెంగా ముద్దాడింది.
2019 వరల్డ్ కప్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు నంబర్‌వన్‌గా అడుగుపెట్టింది. అంచనాలకు తగ్గట్టే తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై 110 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. కానీ, ఆ తర్వాతి మ్యాచ్‌లోనే పాకిస్థాన్ చేతిలో అనూహ్యంగా కంగుతింది. జో రూట్, జోస్ బట్లర్ సెంచరీలు బాదినా కూడా 14 రన్స్‌తో ఓటమిపాలైంది. కానీ చాంపియన్ ఆటతో మోర్గాన్ సేన హ్యాట్రిక్ విజయాలు సాధించి పోటీలోకి వచ్చింది. ఆ తర్వాత శ్రీలంక, ఆస్ట్రేలియా చేతిలో వరుస పరాజయాల నుంచి తేరుకొని సెమీస్‌కు చేరింది.
కివీస్‌తో హోరాహోరీ
సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను చిత్తు చేసి ఇంగ్లండ్, భారత్‌ను ఓడించి న్యూజిలాండ్ టైటిల్ పోరుకు సిద్ధమయ్యాయి. క్రికెట్ మక్కాగా పేరొందిన లార్డ్స్ మైదానంలో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 8 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. హెన్రీ నికోలస్(55), టామ్ లాథమ్(47) రాణించారు. లక్ష్య ఛేదనలో 86 పరుగులకే ఇంగ్లండ్ నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. ఆ దశలో క్రీజులోకి వచ్చిన ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్(84 నాటౌట్) సంచలన ఇన్నింగ్స్‌తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. జోస్ బట్లర్(59)తో కలిసి స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే.. కివీస్ స్పీడ్‌స్టర్ ట్రెంట్ బౌల్ట్ వేసిన ఆఖరి ఓవర్లో ఇంగ్లండ్ విజయానికి 15 రన్స్ అవసరమయ్యాయి. మూడో బంతికి స్టోక్స్ సిక్స్ బాదాడు. ఆ తర్వాత మార్టిన్ గప్టిల్ విసిరిన బంతి స్టోక్స్ బ్యాట్‌కు తగిలి బౌండరీకి వెళ్లడంతో 6 పరుగులు వచ్చాయి. చివరి రెండు బంతుల్లో 3 పరుగులు కావాల్సిన దశలో ఆదిల్ రషీద్, మార్క్ వుడ్ రెండో పరుగు తీసే క్రమంలో రనౌటయ్యారు. దీంతో ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో సూపర్ ఓవర్ ఆడించారు.
సూపర్ ఓవర్ టై:
సూపర్ ఓవర్లో ఇంగ్లండ్ 15 రన్స్ కొట్టింది. ప్రధాన పేసర్ అయిన ఆర్చర్‌కు మోర్గాన్ బంతి ఇచ్చాడు. కివీస్ బ్యాటర్ జేమ్స్ నీషమ్(13 నాటౌట్) రెండో బంతికే సిక్సర్ బాది భయపెట్టాడు. కానీ, ఆర్చర్ సూపర్ బౌలింగ్‌తో నీషమ్‌ను కట్టిపడేశాడు. చివరి బంతికి గప్టిల్ రనౌట్ కావడంతో బ్లాక్ క్యాప్స్ వికెట్ నష్టానికి 15 పరుగులు చేసింది. రెండు జట్ల స్కోర్లు సూపర్ ఓవర్లోనూ సమమయ్యాయి. దీంతో ఇరు జట్లలో ఎక్కువ బౌండరీలు(26) కొట్టిన ఇంగ్లండ్ వరల్డ్‌కప్ విజేతగా నిలువగా, కడదాకా పోరాడి క్రికెట్ అభిమానుల మదిని చూరగొన్న కివీస్ గుండె పగిలినంత పనైంది. దురదృష్టం నీడలా వెంటాడిన వేళ విలియమ్సన్ మైదానంలోనే నిశ్చేష్టుడయ్యాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
MBA student dies | పరీక్షకు ముందు యూనివర్సిటీ భవనం పైనుంచి దూకి.. ఎంబీఏ విద్యార్థిని మృతి
ఉద్యోగుల సుదీర్థ సేవలు సంస్థకు చిరస్మరణీయం : ఎస్ ఓ టు జీఎం ఎం.గోవిందరావు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

