ఇంగ్లండ్, న్యూజిల్యాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో జరిగిన ఒక ఘటన అందరి పెదాల మీద నవ్వులు పూయించింది. ఇంగ్లండ్ విజయం సాధించిన ఈ టెస్టులో మాజీ కెప్టెన్ జోరూట్ (115 నాటౌట్) సెంచరీతో అదరగొట్టగా.. కెప్టెన్ బెన్ స్టోక్స్ (54) కూడా హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే 43వ ఓవర్లో రూట్ కొట్టిన బంతిని ఫీల్డర్ అద్భుతంగా డైవ్ చేసి ఆపేశాడు.
అయితే అప్పటికీ నాన్‌స్ట్రైకర్ క్రీజులో ఉన్న స్టోక్స్ ముందుకు రావడంతో అటువైపు వికెట్లను పడగొట్టేందుకు బంతిని విసిరాడు. అదే సమయంలో క్రీజును చేరుకోవడానికి వేగంగా వెళ్లిన స్టోక్స్.. బ్యాటును ముందుకు జాపాడు. ఫీల్డర్ విసిరిన బంతి అతని బ్యాటుకు తగిలి దూరంగా వెళ్లిపోయింది. అది చూసిన బౌలర్ ట్రెంట్ బౌల్ట్.. టక్కున స్టోక్స్ దగ్గరకు వెళ్లి ఏంటిది? అన్నట్లు చూశాడు.
స్టోక్స్ కూడా దూరంగా వెళ్తున్న బంతిని చూపిస్తూ ఏదో అన్నాడు. అది చూసిన వాళ్లంతా నవ్వుకున్నారు. ఎందుకంటే 2019లో కూడా ఈ రెండు జట్ల మధ్య ప్రపంచకప్ ఫైనల్ జరిగింది. ఆ మ్యాచ్ చివరి ఓవర్లో కూడా ఫీల్డర్ విసిరిన బంతి.. స్టోక్స్ బ్యాట్‌కు తగిలి ఫోర్ వెళ్లింది.
దీంతో ఆ బంతికి ఆరు పరుగులు రావడంతో మ్యాచ్ టైగా ముగిసింది. సూపర్ ఓవర్ కూడా టై అవడంతో.. ఇన్నింగ్స్‌లో ఎక్కువ బౌండరీలు ఉన్న కారణంగా ఇంగ్లండ్‌ను విజేతగా ప్రకటించడం జరిగింది.
If you know, you know 😅
🏴 #ENGvNZ 🇳🇿 pic.twitter.com/ZyIcvwkk8B
— England Cricket (@englandcricket) June 4, 2022