సింగపూర్: ప్రతిష్ఠాత్మక ప్రపంచ చెస్ చాంపియన్షిప్లో డ్రాల పరంపర కొనసాగుతున్నది. గురువారం డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్, దొమ్మరాజు గుకేశ్ మధ్య జరిగిన తొమ్మిదో రౌండ్ పోరు డ్రాగా ముగిసింది. దీంతో వరుసగా మెగాటోర్నీలో ఇద్దరి మధ్య ఆరో డ్రా నమోదైంది.
తొమ్మిది రౌండ్లు ముగిసేసరికి గుకేశ్, లిరెన్ ఇద్దరు 4.5 పాయింట్లతో సంయుక్తంగా కొనసాగుతున్నారు. ఎవరైతే మరో 3.5 పాయింట్లు సాధిస్తారో వారి ఖాతాలో ప్రపంచ టైటిల్ చేరుతుంది. ఇద్దరి మధ్య తొమ్మిదో రౌండ్ గేమ్ 54 ఎత్తుల్లో ముగిసింది.