విజ్క్ ఆన్ జి (నెదర్లాండ్స్): వరుసగా నాలుగు డ్రాల తర్వాత ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్.. టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నీలో తొలి విజయం సాధించాడు. గురువారం జరిగిన ఐదో రౌండ్లో గుకేశ్.. వాన్ నుయెన్ (చెక్ రిపబ్లిక్)ను ఓడించాడు. కానీ మరో గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేసి.. వ్లాదిమిర్ ఫెదొసివ్ తో గేమ్‌లో ఓటమిపాలయ్యాడు.
ప్రజ్ఞానంద.. అనీష్ గిరి (నెదర్లాండ్స్)తో గేమ్‌ను డ్రా చేసుకున్నాడు. ఐదు రౌండ్లు ముగిసేసరికి 3.5 పాయింట్లతో నీమన్, సిందరోవ్, నొదిర్బెక్ అగ్రస్థానంలో ఉండగా 3 పాయింట్లతో గుకేశ్, ఫెదొసివ్, ఫొరిస్ట్ సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు.